“RRR” ఓటిటి రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ హింట్..?

Published on Apr 29, 2022 7:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మాసివ్ మల్టీ స్టారర్ మరియు పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం”. అనేక అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టి ఇండియన్ సినిమా పేరుని మరోసారి నిలబెట్టింది.

ఇప్పటికీ కూడా థియేటర్స్ లో స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా ఉన్న షోస్ లో అదరగొడుతుంది. అయితే ఇక థియేటర్స్ లో ఈ సినిమా రన్ కి ఎండ్ కార్డ్ పడే సమయం వచ్చినట్టే అని RRR వారు కన్ఫర్మ్ చేస్తున్నారు.

అంటే ఈ లెక్కన త్వరలోనే ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ వచ్చేస్తుంది అన్నట్టు హింట్ అని అర్ధం అవుతుంది. అలాగే ఆడియెన్స్ కూడా ఈ ట్వీట్ తో ఆల్ మోస్ట్ RRR ఓటిటి రిలీజ్ త్వరలోనే అన్నట్టు ఫిక్స్ అయ్యిపోయారు. మరి ఈ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :