“అఖండ” పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Oct 8, 2021 11:00 am IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “అఖండ”. ఎప్పుడు నుంచో మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం అంతకంతకూ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా కంప్లీట్ షూట్ ఇటీవల కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సినిమా మ్యూజిక్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటుంది.

అయితే ఆల్రెడీ థమన్ ఈ సినిమాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరక్కొట్టిన సంగతి తెలిసిందే. కానీ దీనితో పాటు టోటల్ అఖండ ఆల్బమ్ కూడా అదిరే లెవెల్లో వచ్చిందట. ఖచ్చితంగా ఈ సినిమా ఆడియో కూడా మంచి హిట్ అవుతుంది అని సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్. దీనితో ఆల్బమ్ పై మరింత ఆసక్తి పెరిగింది అని చెప్పొచ్చు. బాలయ్య కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :