“లైగర్” టైటిల్‌పై ఇంట్రెస్టింగ్ ఇన్‌ఫో..!

Published on Jul 18, 2021 7:03 am IST

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “లైగర్” . ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ మరియు ఛార్మీ కౌర్ కలిసి నిర్మిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. భారీ అంచనాలున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం ఇప్పటికే ముంబైలో భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని, ఫైనల్ షెడ్యూల్‌లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.

అయితే మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ కథాంశానికి తల్లీ కొడుకుల సెంటిమెంట్‌ని జోడించి తీస్తున్న ఈ సినిమాకు అసలు లైగర్ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న దానిపై రకరకాల కథలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే మగ సింహం, ఆడ పులికి పుట్టిన సంకరజాతి జంతువు లైగర్. అయితే ఈ చిత్రంలో హీరో తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతోనే రేర్ టాలెంట్ ఉన్న బిడ్డను కన్నారని అర్ధం వచ్చేలా ఈ టైటిల్ పెట్టారని కొందరు అంటుంటే, మరికొందరేమో ఈ చిత్రంలో హీరోకి నత్తి ఉంటుందని ‘ట’ శబ్ధం పలకడం రాక ‘టైగర్’ని ‘లైగర్’ అని పలుకుతాడని అందుకే ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ పెట్టినట్టు చెబుతున్నారు. అయితే వీటిలో ఏది ఎంతమేరకు నిజమనేది పక్కన పెడితే, ఈ టైటిల్‌తో విజయ్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సంబంధిత సమాచారం :