మెగాస్టార్ “ఆచార్య” బిజినెస్ పై లేటెస్ట్ ఇన్ఫో..!

Published on Jan 29, 2022 12:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా “ఆచార్య”. మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం వచ్చే ఫిబ్రవరి లోనే రిలీజ్ కావాల్సి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ మేకర్స్ ప్రస్తుతం పరిస్థితులు రీత్యా ఏప్రిల్ కి షిఫ్ట్ చేశారు. దీనితో మరికొన్ని పనులు ఈ చిత్రం నుంచి ఆలస్యం అయ్యాయి.

ఇక లేటెస్ట్ గా అయితే ఇంట్రెస్టింగ్ సమాచారం దీనిపై వినిపిస్తుంది. మరి ఈ సినిమా తాలుకా థియేట్రికల్ బిజినెస్ ని మేకర్స్ ఈ వచ్చే మార్చ్ నుంచి స్టార్ట్ చేయనున్నారట. అలాగే వీలైనంత త్వరగా ఈ బిజినెస్ డీల్స్ ని ముగించి అనుకున్న సమయానికి రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ భారీ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించగా కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం :