నితిన్ “మాచర్ల నియోజకవర్గం” పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో!

Published on Sep 14, 2021 8:00 am IST


యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో రీసెంట్ గా అనౌన్స్ చేసిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “మాచర్ల నియోజకవర్గం” కూడా ఒకటి. దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ను స్టార్ట్ చేసుకోనుంది. అయితే ఈ చిత్రం పై ఇప్పుడు ఓ ఆసక్తికర సమాచారం వినిపిస్తుంది. ఈ చిత్రంలో ప్రముఖ విలక్షణ నటుడు ‘సముద్రఖని’ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట.

అంతే కాకుండా తన రోల్ డ్యూయల్ రోల్ గా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఓ సినిమాలో సముద్రఖని రోల్ ఉంది అంటేనే ఎంతో కొంత స్పెషల్ ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు డ్యూయల్ రోల్ అంటున్నారు. మరి ఈ సినిమాలో మూవీ లవర్స్ లో ఎలాంటి ట్రీట్ ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :