ఇంట్రెస్టింగ్..”భీమ్లా” లో నిత్యా రోల్ అలా అంటుందట.!

Published on Nov 7, 2021 10:21 pm IST

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ “భీమ్లా నాయక్” నుంచి వచ్చిన మాస్ సాంగ్ “లాలా భీమ్లా” యుఫోరియా నడుస్తుంది. భారీ హైప్ లో వచ్చిన ఈ సాంగ్ సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుండగా ఈ సినిమాలో పవన్ సరసన నటిస్తున్న నిత్యా మీనన్ రోల్ ఎలా ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఈ సినిమాలో తన పాత్ర భీమ్లా నాయక్ నే కమాండ్ చేసేలా ఉంటుందట. అలాగే ఇద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా తన పాత్ర ని ఒరిజినల్ కంటే ఎక్కువగా త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. అది ఖచ్చితంగా ప్రతీ ఒక్కరినీ మెప్పించేలా ఉంటుందని తెలిపింది. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More