“పుష్ప” మాస్ ట్రైలర్ కట్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Nov 28, 2021 3:04 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ లో మంచి అంచనాలు తెచ్చుకుంది.

ఇక రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం నుంచి అదిరే ట్రైలర్ కోసం చాలా ఆసక్తిగా అంతా ఎదురు చూస్తుండగా నిన్ననే మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ట్రైలర్ పనులే జరుగుతున్నాయని త్వరలో ఈ సాలిడ్ ట్రైలర్ ని తీసుకొస్తామని తెలిపారు.

అయితే ఈ ట్రైలర్ పైన ఆసక్తికర సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ఫైనల్ కట్ చాలా అవుట్ స్టాండింగ్ గా వచ్చిందట. చాలా నాచురల్ విజువల్స్ తో సాలిడ్ యాక్షన్ తో అదిరే లెవెల్లో వచ్చిందని ఇన్సైడ్ టాక్. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :