“రాధే శ్యామ్” సెకండ్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

“రాధే శ్యామ్” సెకండ్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Nov 27, 2021 11:00 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన భారీ చిత్రం “రాధే శ్యామ్”. దీనికంటూ సెపరేట్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం చాలా స్పెషల్ ప్రాజెక్ట్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా విడుదలకి ఇంకా సమయం ఉన్నందున ఒక్కో అప్డేట్ ని మేకర్స్ నెమ్మదిగా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన ఫస్ట్ సాంగ్ “ఈ రాతలే” మంచి రెస్పాన్స్ ను అందుకొని కొనసాగుతుంది. ఇక ఇప్పుడు రెండో చార్ట్ బస్టర్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వినిపిస్తుంది. ఈ సారి సాంగ్ ని కూడా మంచి విజువల్స్ తోనే చూపిస్తారంట. అంతే కాకుండా ఈసారి సాంగ్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించగా దీనిని ఈ డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ చెయ్యనున్నారట. అలాగే ఇది సౌత్ వెర్షన్ వరకు మాత్రమే కూడా కావచ్చు. మరి వేచి చూడాలి ఇదెలా ఉంటుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు