”RRR” హిందీ ఈవెంట్ కి వెరీ ఇంట్రెస్టింగ్ ప్లానింగ్స్ అట.!

Published on Dec 18, 2021 10:01 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాసివ్ కటౌట్స్ తో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ తో ప్లాన్ చేస్తున్నరు. మరి ఈ ప్లానింగ్ లో భాగంగా మొదటి బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బాలీవుడ్ లో ప్లాన్ చేశారు.

రేపు డిసెంబర్ 19 ఆదివారం భారీ స్థాయిలో జరగనున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇప్పుడు కొన్ని వెరీ ఇంట్రెస్టింగ్ సమాచారాలు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా సల్మాన్ ఖాన్ ప్రముఖ గెస్ట్ గా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏమిటంటే హిందీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే యాంగిల్ లోనే ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట.

అందులో భాగంగానే కరణ్ జోహార్ ఈ ఈవెంట్ ని హోస్ట్ చేయనున్నాడని ఇప్పుడు టాక్. అలాగే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ర్యాపిడ్ ఫైర్ గేమ్ ని కూడా చిత్ర బృందం కోసం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఒక స్టాండప్ యాక్ట్ కూడా ఈ ఈవెంట్ ని నిర్వహించనున్నట్టు తాజా సమాచారం. మొత్తానికి మాత్రం “RRR” ఫస్ట్ ఈవెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :