“గాడ్ ఫాథర్” సల్మాన్ రోల్ పై మరింత ఇంట్రెస్టింగ్ ఇన్ఫో!

Published on Oct 13, 2021 10:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఆచార్య” షూట్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత మెగాస్టార్ రెండు సాలిడ్ రీమేక్ చిత్రాలు చేస్తున్నారు. వాటిలో మళయాళ బ్లాక్ బస్టర్ చిత్రం “లూసిఫెర్” రీమేక్ ఒకటి కాగా దానిని దర్శకుడు మోహన్ రాజా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు.

“గాడ్ ఫాథర్” టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది. ఈ చిత్రంలో సల్మాన్ పాత్ర అనుకున్న దానికంటే ఎక్కువే ఉంటుందట.

ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే సల్మాన్ పై ఓ అదిరే సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. మొత్తానికి ఈ గాడ్ ఫాథర్ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువే ఉండేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ అలాగే సూపర్ గుడ్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :