“విజయ్ 66” సినిమాపై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో..!

Published on May 12, 2022 10:00 am IST

ఇళయ తలపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “బీస్ట్” తో తన కెరీర్ లో మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ హిట్ అయితే కాలేదు కానీ తమిళ నాట మంచి వసూళ్ళని సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ మొదటి సారిగా తెలుగు మరియు తమిళ భాషల్లో కలిపి దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యిన సంగతి తెలిసిందే.

తన కెరీర్ లో 66వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ మరియు భారీ తారాగణం కూడా ఫిక్స్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చాలా సెన్సిబుల్ ఎమోషన్స్ తో ప్లాన్ చేసుకున్నారట.

అలాగే తమిళ్ నేపథ్యంలోనే అధిక శాతం సినిమా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా హీరోయిజం కి సంబంధించి కూడా మంచి లైన్ ని తాను రాసుకున్నారట. మరి ఈ సినిమా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం, దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :