“ఆచార్య”లో ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Oct 5, 2021 3:00 pm IST


ఇపుడు టాలీవుడ్ నుంచి వస్తున్న పలు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తీసిన భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. ఎప్పుడు నుంచో ఊరిస్తూ వస్తున్న ఈ మల్టీ స్టారర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

అయితే టాకీ పార్ట్ ను ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండు సాంగ్స్ ని బ్యాలన్స్ ఉంచుకోగా వాటిని కూడా ఇప్పుడు ఫినిష్ చేసే పనిలో ఉంది. అయితే వాటిలో చిరు మరియు చరణ్ లతో ప్లాన్ చేసిన సాంగ్ పై ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకి వచ్చింది. వీరిద్దరి మధ్య డిజైన్ చేసిన ఈ సాంగ్ వేరే లెవెల్లో వచ్చిందట.

అంతే కాకుండా వీరిద్దరూ చేసిన ఒక సిగ్నేచర్ మూమెంట్ థియేటర్స్ లో అదిరిపోతుందట. అలాగే విజువల్ గా కూడా ఈ సాంగ్ అద్దిరిపోద్దట. దీనిని బట్టి మణిశర్మ మళ్ళీ చిరుకి ఎలాంటి ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ ఇచ్చారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మాస్ యుఫోరియా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ల వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :