“టక్ జగదీష్” స్ట్రీమింగ్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Sep 8, 2021 11:33 am IST


ప్రస్తుతం ఓటిటి రిలీజ్ లలో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న చిత్రం “టక్ జగదీష్” నాచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ 10న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రెడీగా ఉంది. మరి పలు కారణాల చేత నేరుగా స్ట్రీమింగ్ కి వస్తున్న ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

ఈ చిత్రం 10వ తారీఖున అంటే అర్ధ రాత్రి 12 గంటలకే కాకుండా 9న రాత్రి 10 గంటల నుంచే అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇది వరకు ప్రైమ్ వీడియోలో వచ్చిన పలు డిజిటల్ రిలీజ్ లకి దాదాపు ఇలానే అయ్యింది. సో అదే ఫార్మాట్ లో కాస్త ముందే టక్ జగదీష్ అందుబాటులోకి రానున్నట్టుగా సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో రేపు రాత్రి వరకు ఆగి చూస్తే కన్ఫర్మ్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :