ఆసక్తికర ఇన్ఫో..”భీమ్లా నాయక్” లో ఈ లెజెండరీ నటుడు.!

Published on Dec 7, 2021 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా పక్కా బ్లాక్ బస్టర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాల్లో స్ట్రాంగ్ బజ్ ఉంది.

అలానే సినిమా అవుట్ పుట్ పరంగా మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అందుకే సినిమా రిలీజ్ విషయంలో కూడా రాజీ పడడం లేదని టాక్ ఉంది. అయితే ఈ సినిమాలో నటీనటుల పరంగా కూడా చాలా జాగ్రత్తలు కనిపించగా ఓ ఆసక్తికర సమాచారం ఇప్పుడు బయటకి వచ్చింది.

ఎప్పుడు నుంచో వెండి తెరపై బాగా మిస్సవుతున్న లెజెండరీ నటులు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ సినిమాలో నటిస్తున్నారట. ఇది తాను రీసెంట్ గా ఇచ్చిన ఈటీవీ బుల్లితెర షో ‘ఆలీతో సరదాగా’ ద్వారా కన్ఫర్మ్ చేసి వెల్లడి చేశారు. ఇది ఓ పాజిటివ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో తన పాత్ర ఎలా ఉంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :