ఇంట్రెస్టింగ్..అక్కడ “కల్కి” లో నిడివి తగ్గింపు

ఇంట్రెస్టింగ్..అక్కడ “కల్కి” లో నిడివి తగ్గింపు

Published on Jul 6, 2024 9:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రమే “కల్కి 2898 ఎడి”. మరి సైఫై మైథలాజికల్ వండర్ గా తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లు అందుకొని అదరగొడుతుండగా యూఎస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది.

అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా కూడా 3 గంటల నిడివి తోనే రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. అలాగే సినిమా ఫస్టాఫ్ కూడా స్లో అయ్యినట్టుగా టాక్ వచ్చింది. దీనితో కొంచెం రన్ టైం కట్ చెయ్యాల్సింది అని మాటలొచ్చాయి. అయితే యూఎస్ లో కల్కి రన్ టైం ఇప్పుడు బాగా తగ్గించినట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ సినిమా నిడివిని పావుగంట తగ్గింది రెండు గంటల 45 నిమిషాల రన్ తో షోస్ వెయ్యబడుతున్నాయి. దీనితో ఇది ఆసక్తిగా మారింది. ఇక ఈ భారీ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా దీపికా పడుకోణ్ ముఖ్య పాత్రలో నటించింది. అలాగే ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు