ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తాను హీరోగా మాత్రమే కాకుండా గెస్ట్ రోల్ లో కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా తాను అతిధి పాత్రలో చేస్తున్న సినిమానే “కన్నప్ప”. మంచు హీరో డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా వస్తున్నా ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే ఇపుడు ప్రభాస్ లైనప్ లో ఉన్న ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ “స్పిరిట్” కూడా ఒకటి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం మంచు విష్ణు రెడీ అయ్యాడు. ఇటీవల మేకర్స్ నటీనటుల కోసం చూస్తున్నట్టుగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే దీనికి తాను కూడా అప్లై చేసుకున్నాను అంటూ విష్ణు పోస్ట్ చేసాడు. అప్లై చేసి వేచి చూస్తున్నాను అని విష్ణు చెబుతున్నాడు. మరి కన్నప్ప కోసం ప్రభాస్ వస్తే ఇపుడు ప్రభాస్ స్పిరిట్ కోసం తాను సిద్ధం అంటున్నాడు. మరి ఈ క్రేజీ కలయిక మళ్ళీ సాధ్యం అవుతుందో లేదో వేచి చూడాలి.