“హను మాన్” మ్యూజిక్ ఎఫెక్ట్స్.. అతడి నుంచి ఆ ట్రీట్ రాబోతోందా?

“హను మాన్” మ్యూజిక్ ఎఫెక్ట్స్.. అతడి నుంచి ఆ ట్రీట్ రాబోతోందా?

Published on Jun 19, 2024 3:00 PM IST

ఈ ఏడాదిలో మన టాలీవుడ్ డెలివర్ చేసిన మొట్ట మొదటి సెన్సేషనల్ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో చిత్రం “హను మాన్” అనే చెప్పాలి. మరి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమాకి ఉన్న హిట్ ఫ్యాక్టర్స్ లో ఖచ్చితంగా సంగీత దర్శకుడు హరీష్ గౌరకి సింహభాగం ఇవ్వాలి. రోమాలు నిక్కబొడుకునే స్కోర్ ని ఈ సినిమాకి తాను అందించారు. అలాగే పాటలు కూడా మంచి చార్ట్ బస్టర్ అయ్యాయి. అయితే తాను లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో “హను మాన్” చేసిన కొన్ని వర్క్స్ రివీల్ చేసాడు.

సినిమాలో కొన్ని సీన్స్ కి స్పెషల్ మ్యూజిక్ ఎఫెక్ట్స్ ని మనుషులతోనే చేయించడం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో హను మాన్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని ఏమన్నా హరీష్ గౌర విడుదల చేస్తాడేమో చూడాలి. సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని ట్రాక్స్ వరకు సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. కానీ మేకర్స్ వాటిని వేరేగా రిలీజ్ చేసేసారు. మరి హను మాన్ ఓఎస్టి వస్తే ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు