ఖైదీ నెం 150 లో ఎవరు నటిస్తున్నారో తెలుసా ?

khaidi150
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి కూడా ఎటువంటి బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం భోగి నాటికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర వర్గాల నుందిఅందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్న నటి శ్రియ శరన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.

సినిమాలో ఉండే కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈమె నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది, ఆ పాత్ర నిడివి ఎంత అనే విశేషాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఎటువంటి అధికారిక సమాచారమూ రాలేదు. ఇకపోతే ఈ చిత్రంలో చిరుతో కలిసి యంగ్ హీరోయిన్ క్యాథరిన్ థ్రెస ఓ ఐటం పాటలో ఆడిపాడనున్న సంగతి తెలిసిందే. తమిల్ హిట్ మూవీ ‘కత్తి’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణ్ ‘కొణిదల ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.