కొరటాల – మహేష్ బాబుల కొత్త సినిమా థీమ్ అదేనా ?

Mahesh-Babu-Koratala-Shiva
కొరటాల శివ.. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిపోతున్న దర్శకుడు. సోషల్ ఎలిమెంట్ ని స్ట్రైకింగ్ గా చెప్పడంకన్నా గొప్ప కమర్షియల్ ఫార్ములా లేదని నమ్మే కొరటాల తన ప్రతి సినిమాలో సమాజానికి ఉపయోగపడే ఎదో ఒక మంచి అంశాన్ని చెబుతూ వచ్చాడు. తన మొదటి సినిమా ‘మిర్చి’ లో పక్కవాళ్ళని ప్రేమిద్దాం.. పోయేదేముంది తిరిగి ప్రేమిస్తారంతే అన్నాడు. రెండవ సినిమా ‘శ్రీమంతుడు’ లో బ్రతుకునిచ్చిన ఊరి ఋణం తీర్చుకోవాలని సొసైటీలో పెద్ద స్థాయిలో ఉన్నవారంతా గ్రామాలను దత్తత తీసుకునేలా చేశాడు.

ఇక మూడవ చిత్రం ‘జనతా గ్యారేజ్’ లో పర్యావరణాన్ని ప్రేమించండి.. పక్క వాడి కష్టంలో తోడుండండి అన్నాడు. అలాగే తాను మహేష్ బాబుతో చేయబోయే సినిమా సబ్జెక్ట్ కూడా చాలా పెద్దదని, అందులోనూ సోషల్ ఎలిమెంట్ ఉందని, ఖచ్చితంగా బాగుంటుందని అన్నాడే కానీ అదేమిటో చెప్పలేదు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అది ‘లవ్ యువర్ సెల్ఫ్ – నిన్ను నువ్వు ప్రేమించుకో’ అనే అంశమట. ప్రస్తుత కాలంలో యాంత్రిక జీవనానికి అలవాటుపడి కనీసం తమ గురించి తామే ఆలోచించుకోని జనాలకి లైఫ్ ని ఎలా గడపాలో చెప్పే విధంగా ఈ కథ ఉంటుందట. ఇక సినిమాలో కొరటాల ఈ అంశాన్నిని మహేష్ తో ఏ విధంగా చేప్పిస్తాడో చూడాలి.