బాల నటుడిగా మంచి పేరు తెచ్చుకొని హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు తనీష్. కానీ గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతవుతున్న తనీష్ కి హీరోగా సినిమా అవకాశాలు కూడా చాలావరకు తగ్గాయి. చివరికి కృష్ణవంశీ నక్షత్రం సినిమాలో విలన్ గా కూడా నటించాడు.అయినా తనీష్ ఫేట్ మాత్రం మారలేదు. ప్రస్తుతం ఈయన బిగ్ బాస్ 2 హౌస్ లో కంటెస్టెంట్ గాఉన్నారు.
ఈ దశలో తనీష్ హీరోగా ‘దేశ దిమ్మరి’ అనే చిత్రం రాబోతుంది.నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తనీష్ సరస షిరీన్ కథానాయకిగా నటిస్తోంది. సవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై స్వతంత్ర గోయల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.
అయితే ఈ చిత్రం గురించి ఒక ఆసక్తి కరమైన విషయం ఏంటంటే రజనీకాంత్ ‘కాలా’ సినిమాని చిత్రీకరించిన హిలీనీయం 8ఆర్ లేటెస్ట్ వెర్షన్ కెమెరాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. ఈ సినిమాలో తనీష్ స్వయంగా ఓ పాట కూడా పాడారు’. జూలైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
