బాలయ్య ‘అఖండ 2’ స్టోరీ లైన్ ఇదే

Published on May 15, 2023 9:00 am IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అందుకే, ఈ సినిమా సీక్వెల్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, కొన్ని నెలలుగా ‘అఖండ 2’ కచ్చితంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ స్టోరీ లైన్ పై చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ప్రజా క్షేమం కోసం అఘోర రాజకీయ అవతారం ఎత్తితే ఎలా ఉంటుంది ?, నేటి రాజకీయాలను ఆ దేవ భక్తుడు ఎలా మార్చాడు?, అసలు రాజకీయాలు దేనికి ?, ఎలాంటి సేవ చేయడానికి వంటి అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నారు.

అఖండ లో శివుడ్ని, శివ భక్తితో పాటు బాలయ్య నట విశ్వరూపాన్ని చూపించి అఖండ విజయాన్ని నమోదు చేశాడు. మరి ‘అఖండ 2’తో బాలయ్య ఏ రేంజ్ విజయాన్ని నమోదు చేస్తాడో చూడాలి. పైగా ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. బాలయ్య చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిపడే విధంగా బోయపాటి ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాడు. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 10, 2023న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ‘అఖండ 2’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :