నాగ్ “ది ఘోస్ట్” ప్రీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ టాక్..!

Published on Sep 23, 2022 6:29 pm IST

ఈ దసరా కి మన టాలీవుడ్ నుంచి రాబోతున్న సాలిడ్ చిత్రాల్లో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ది ఘోస్ట్” కూడా సిద్ధంగా ఉంది. ఈ చిత్రం నాగ్ కెరీర్ లో మంచి మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తుండగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండగా మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను సిద్ధం చేస్తున్నారు.

ఈ సెప్టెంబర్ 25న ఈ ఈవెంట్ ని ఫిక్స్ చెయ్యగా దీనిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ అయితే తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి గాను స్పెషల్ గెస్టులుగా అక్కినేని యంగ్ హీరోలే వస్తారట. అంటే ఈ ఈవెంట్ లో అక్కినేని నాగార్జున తో అక్కినేని నాగ చైతన్య మరియు అక్కినేని అఖిల్ లు కూడా మెరుస్తారట. అయితే దీనిపై అధికారిక అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :