నితిన్ “మాచర్ల నియోజకవర్గం”పై ఇంట్రెస్టింగ్ న్యూస్..!

Published on Feb 25, 2022 2:00 am IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా, ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో ఉండబోతుందని ఇదివరకు తెలిసిందే.

అయితే ఈ సినిమా కథా లక్షణాలు “రంగస్థలం’ సినిమాకి దగ్గరగా కనిపిస్తాయన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో అక్కడి రాజకీయాలతో ముడిపడి ఈ సినిమా నడుస్తుందని, ఎప్పుడూ ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా గెలిచి అక్రమాలకు పాల్పడుతున్న ఓ పెద్ద మనిషికి పోటీగా హీరో రంగంలోకి దిగుతాడని, అక్కడి నుంచి ఇద్దరి మధ్య రివేంజ్ డ్రామా మొదలుకానుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి నటిస్తుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :