ప్రభాస్ “ప్రాజెక్ట్ కె”కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..!

Published on Mar 21, 2022 9:31 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ప్రభాస్ నటించిన “రాధేశ్యామ్” ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను తెచ్చుకుని అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో ప్రభాస్ అభిమానులందరూ ఇప్పుడు నెక్స్ట్ సినిమాలపై భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా ‘సలార్’, ‘ఆది పురుష్’, ‘ప్రాజెక్ట్‌ కె’, ‘స్పిరిట్‌’ వంటి భారీ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. అయితే మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’కి సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అసలు ‘కె’ అంటే ఏమిటనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికీ ఓ క్లారిటీ లేదు. ఇక అందరూ అనుకున్నట్టుగా ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కానీ, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కడం లేదని.. మహాభారతంలోని రెండు ప్రధాన పాత్రలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న కథ ఇది అని టాక్ నడుస్తుంది. అయితే ఆ రెండు పాత్రలలో ఒకటి విష్ణుమూర్తి అవతారం కాగా.. రెండు అశ్వద్ధామ అవతారం. కలియుగాంతంలో విష్ణుమూర్తి కల్కిగా అవతరించాడని, అదే పాత్రను ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ చేస్తున్నాడట. దీని ప్రకారం ‘కె’ అంటే కల్కి అని అర్థమట. ఇక అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ కనిపించనున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చేవరకు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :