ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం, ‘పుష్ప 2’ పైనే బన్నీ – సుకుమార్ తమ ఫుల్ ఫోకస్ పెట్టారు. కాగా ‘పుష్ప 2’ పై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. పుష్ప 2 లో ఓ అతిధి పాత్ర ఉంది. ఈ పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ గెస్ట్ రోల్ లో కనిపించే చాన్స్ ఉందని టాక్. మరి ఈ రుమార్ నిజం అయితే.. పుష్ప 2 కి బాలీవుడ్ లో మరింత గిరాకీ పెరుగుతుంది.
బన్నీ పాత్రను పరిచయం చేస్తూ వచ్చే ఈ అతిధి పాత్ర గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా నిలుస్తోందని.. పైగా ఈ పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ పుష్ప సీక్వెల్ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. ప్రముఖ నటీనటులు ఈ సీక్వెల్ లో కనిపించనున్నారు. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.