‘పుష్ప 2’ రిలీజ్ పై క్రేజీ అప్ డేట్ !

Published on May 29, 2023 6:53 am IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం, ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ గురించి ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ‘పుష్ప2’ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సెకండ్ హాఫ్ లో బన్నీ డాన్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ లుక్ లో బన్నీ వెరీ స్టైలిష్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.

అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. మరి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :