“వలిమై”కి వెయ్యి కంటే ఎక్కువ బైక్స్ వాడారట..!

Published on Feb 26, 2022 8:01 pm IST

తమిళ స్టార్‌ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా, హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం “వలిమై”. జీ స్టూడియోస్ మరియు బోని కపూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాలతో ఈ గురువారం రోజున విడుదలైన ఈ చిత్రం హిట్‌టాక్‌ను తెచ్చుకుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది.

ఈ సినిమాలో రేసింగ్ సన్నివేశాలు చాలా హైలెట్‌గా అనిపించాయి. అయితే ఈ రేసింగ్‌కి సంబంధించి మొత్తం 1000కి పైగానే బైక్స్‌ని వాడారట. ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే ఇది హైయెస్ట్ రికార్డ్ అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :