లేటెస్ట్..”భీమ్లా నాయక్” పై కిర్రాక్ అప్డేట్స్.!

Published on Oct 3, 2021 7:27 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో నటిస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. మళయాళ రీమేక్ అయ్యప్పణం కోషియం ని దర్శకుడు సాగర్ కే చంద్ర తెలుగులో తెరకెక్కిస్తున్నాడు. అయితే భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో చాలానే మార్పులు చేర్పులు కూడా చేసారు.

అలానే పవన్ మరియు రానా లు చేస్తున్న పాత్రలకు ఫిమేల్ లీడ్స్ ని మేకర్స్ సెట్ చేశారు. అయితే పవన్ కి జంటగా నిత్య మీనన్ ఫిక్స్ కాగా రానా కి ఎవరు అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ని ముందు అనుకున్నారు కానీ రీసెంట్ గా రిపబ్లిక్ ఇంటర్వ్యూలో తన మాటల ద్వారా తాను ఈ సినిమా చేయట్లేదు అనే అర్థం అయ్యింది.

మరి ఎట్టకేలకు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది అని చెప్పాలి. ఈ చిత్రంలో రానా జంటగా నటి సంయుక్త మీనన్ నటించినట్టుగా చెబుతుంది. భీమ్లా నాయక్ సినిమాలో స్క్రీన్ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. దీనితో పాటుగా ఈ సంక్రాంతికి మాసివ్ గా ఉంటుందని రిలీజ్ డేట్ పై కూడా మరో అదిరే క్లారిటీ కూడా ఇచ్చింది. మరి దీనిపై మేకర్స్ ఎం చెప్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :