మరో వైవిధ్యమైన పాత్రలో ‘సమంత ?

మరో వైవిధ్యమైన పాత్రలో ‘సమంత ?

Published on Jul 31, 2022 7:57 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – సమంత కలయికలో శివ నిర్వాణతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో సమంత క్యారెక్టర్ చాలా వినూత్నంగా ఉండబోతుందట. నెగిటివ్ షేడ్స్ తో సాగే ఈ క్యారెక్టర్ చివరకు ఎమోషనల్ గా ఎలా టర్న్ తీసుకుంది ?, లవ్ విషయంలో పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ గా ఎలా మారింది ? అనే కోణంలో సమంత పాత్ర సాగుతుందట. ఈ సినిమా కథ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.

శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. అయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ చిత్రం కోసం కూడా మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ. ఐతే, ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ ద్వారా సరికొత్త కథను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు