సమంత – విజయ్ సినిమా పై ఇంట్రెస్టింగ్ రూమర్ !

Published on Mar 21, 2022 7:49 am IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ శివ నిర్వాణతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించడానికి మొదట బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని సంప్రదించారు. అయితే, కియారా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో ఈ ఆఫర్‌ను తిరస్కరించింది.

ఆ తర్వాత మేకర్స్ సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పుకారు బాగా వైరల్ అవుతుంది. ఇక విజయ్ – శివ చిత్రం ఆర్మీ నేపథ్యంలో ఉంటుందని, అందులో విజయ్ మేజర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అలాగే ఇందులో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట.

శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. అయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉన్నాయి. ఆ తరహాలోనే విజయ్ చిత్రం కోసం కూడా మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ.

సంబంధిత సమాచారం :