రౌడీ హీరో రచయిత అవతారం ఎత్తనున్నాడట…!

Vijay Devarakonda

విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు సినిమాలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో రష్మిక మందాన జంటగా తెరకెక్కిన “డియర్ కామ్రేడ్” మూవీ వచ్చేనెల 26 న విడుదల కానుంది. అలాగే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో క్రీడా ప్రధానంగా సాగే మరో మూవీలో విజయ్ నటిస్తున్నారు.’హీరో’ అనే క్రేజీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీలో విజయ్ ప్రొఫెషనల్ బైక్ రైడర్ గా కనిపిస్తారని వినికిడి. ఈ రెండు చిత్రాలతో పాటు డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ ఓ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే ఈ మూవీలో విజయ్ పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయంలో వైరల్ అవుతుంది. విజయ్ ఈ చిత్రంలో ఓ రచయితగా కనిపిస్తారట. అలాగే రచయితగా ఆయన రాసిన కథల పాత్రలలో మళ్ళీ ఆయన కనిపిస్తారట. వైవిధ్యంగా అనిపిస్తున్న ఈ కధనంతో విజయ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం కనిపిస్తుంది. మరో విశేషం ఏమిటంటే ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారట. ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Exit mobile version