ఇంట్రెస్టింగ్ రన్ టైం తో రవితేజ “ధమాకా”.!

ఇంట్రెస్టింగ్ రన్ టైం తో రవితేజ “ధమాకా”.!

Published on Dec 13, 2022 7:01 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ధమాకా” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే ఓ సాలిడ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రినాథరావు నక్కిన నేతృత్వంలో తెరకెక్కుతుంది. ఇక మంచి అంచనాలు అయితే ఉన్న ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ ని కూడా కంప్లీట్ చేసేసుకుంది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి అయితే ఇంట్రెస్టింగ్ రన్ టైం లాక్ అయ్యినట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. ఈ సినిమా రవితేజ గత సినిమాలతో పోలిస్తే తక్కువ రన్ టైం గా కట్ చేశారట. ఇంతకీ ఈ సినిమా రన్ టైం ఎంతంటే కేవలం 2 గంటల 10 నిమిషాలే అట.. మరి ఇది తన రీసెంట్ టైం లో షార్ట్ అండ్ క్రిస్ప్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రం అయితే ఆల్రెడీ భీమ్స్ సంగీతం తో మంచి మ్యూజికల్ హిట్ కాగా ఈ డిసెంబర్ 23న అయితే గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు