ప్రభాస్ భైరవ, బాహుబలి పాత్రలకి ఆసక్తికర పోలికలు..!

ప్రభాస్ భైరవ, బాహుబలి పాత్రలకి ఆసక్తికర పోలికలు..!

Published on Jul 2, 2024 3:52 PM IST


ఇండియన్ సినిమా దగ్గర కొన్ని గుర్తుండిపోయే పత్రాలు జాబితా తీస్తే అందులో ఖచ్చితంగా మన టాలీవుడ్ పాన్ ఇండియా లెవెల్ హీరో ప్రభాస్ నటించిన పలు పాత్రలు కూడా తప్పకుండా నిలుస్తాయి అని చెప్పాలి. మరి వీటిలో యూనానిమస్ గా బాహుబలి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ రోల్ తర్వాత నుంచే ప్రభాస్ ని వెతుక్కుంటూ ఎన్నో ఐకానిక్ పాత్రలు ప్రభాస్ దగ్గరకి చేరుకున్నాయి.

అయితే ఈ పాత్రకు దగ్గర పోలికలు తాను నటించిన తాజా చిత్రం “కల్కి 2898 ఎడి” లో భైరవ పాత్ర కూడా మంచి ఇంపాక్ట్ ని కలిగించింది. అయితే ఈ రెండు రోల్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం కామన్ గా కనిపిస్తుంది అని చెప్పాలి. అక్కడ బాహుబలి పాత్ర చూస్తే దర్శకుడు రాజమౌళి అత్యంత శక్తివంతుడిగా అన్ని కలల్లో ఆరి తేరినవాడిగా ప్రెజెంట్ చేశారు. బాహు బలి అనే పేరు తగ్గట్టుగానే అత్యంత బలం కూడిన వాడిలా కొన్ని అసాధ్యాలు సుసాధ్యాలు చేసి చూపిస్తాడు.

శివ లింగాన్ని ఎత్తడం అయితేనేమి, ఎవ్వరూ ఎక్కలేని కొండని దాటి పైకి చేరుకోవడం అయితేనేం చాలానే ప్రభాస్ పాత్రని మంచి పవర్ఫుల్ గా రాజమౌళి ప్రెజెంట్ చేశారు. ఇక ఇదే తరహాలో కల్కి లో భైరవ రోల్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. యాస్కిన్ సైన్యం దగ్గర కూడా అడ్వాన్స్డ్ ఆయుధాలు అవీ ఉన్నప్పటికీ వారు అశ్వథ్థాముని కనీసం ఏమీ చెయ్యలేకపోతారు కానీ ఒక్క భైరవ మాత్రం కొంచెం అయినా గట్టి పోటీ ఇచ్చి నిలవగలుగుతాడు.

అలాగే ఓ సందర్భంలో మెరుపు ధాటికి కింద [పడ్డ చక్రాన్ని కూడా ఒంటి చేత్తో ఆపగలుగుతాడు. ఇవి కూడా మంచి ఆశ్చర్యం కలిగిస్తాయి. వీటితో చూస్తే డెఫినెట్ గా బాహుబలి రీతిలో సన్నివేశాలు గుర్తు రాక మానవు. మొత్తానికి అయితే అలా ఇంట్రెస్టింగ్ కామన్ పాయింట్ రెండు పాత్రల్లో కలిసింది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు