మేనల్లుడిని లైన్లో పెట్టిన పవన్ !


ఇప్పటికే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు, జనసేనపార్టీ రాజకీయపరమైన కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇవేకాక పవన్ మరో కొత్త రోల్ ని కూడా ఎంచుకున్నాడు. పవన్ ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేయాలనీ భావిస్తున్నాడట. ఇప్పటికే తన వీరాభిమాని అయిన నితిన్ తో పవన్ కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు త్రివిక్రమ్ తో కలసి పవన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం అందుతోంది. కాగా దీనికి సంభందించిన అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కూడా పవన్ ప్రొడక్షన్ లో రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రం రాబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు పట్టాలెక్కలేదు.సాయి ధరమ్ తేజ్, పవన్ కాంబినేషన్ లో రాబోవు చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడితే మెగా అభిమానులకు అది శుభ వార్తే.