రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా ?


‘బాహుబలి’ చిత్రంతో దర్శకుడు రాజమౌళి స్థాయి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన జాతీయ స్థాయి దర్శకుల్లో ఒకరు. ఒక సినిమా కోసం ఏకంగా 5 సంవత్సరాల్ని వెచ్చించడంతో ఆయన డెడికేషన్ చూసి అన్ని భారతీయ సినీ పరిశ్రమలు ఆశ్చర్యపోయాయి. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు తమతో కలిసి సినిమాలు చేయమని భారీ అవకాశాలిచ్చాయి. బోలెడంత రెమ్యునేషన్ ను కూడా ఆఫర్ చేశాయి.

కానీ రాజమౌళి వాటిలో వేటికీ ఓకే చెప్పకుండా తన విజన్ ను నమ్మి బాహుబలి బాలీవుడ్ లో సినిమాను రిలీజ్ చేసి చిత్రం నేషనల్ సినిమాగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారకుడైన నిర్మాత, దర్శకుడు కరణ్ జొహార్ తో సినిమా చేసే యోచనలో ఉన్నాడని సమాచారం. అది కూడా ప్రభాస్ ను బాలీవుడ్ కు పరిచయం చేసే సినిమా అట. కరణ్ జొహార్ కూడా చాలా కాలం నుండి ప్రభాస్ హీరోగా ఒక హిందీ సినిమా చేయమని అడుగుతుండటంతో రాజమౌళి ఈ విషయంపై ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిగా ఉన్నారట. అయినా ఈ విషయంపై రాజమౌళి, ప్రభాస్, కరణ్ జోహార్ లలో ఎవరి నుండైనా అధికారిక ప్రకటన వెలువడే వరకు కాస్త ఓపిగ్గా ఎదురుచూక తప్పదు.