“బ్రహ్మస్త్ర” ఓటిటి రిలీజ్ కి ఇంట్రెస్టింగ్ స్టెప్..!

ఈ ఏడాది బాలీవుడ్ నుంచి భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “బ్రహ్మాస్త్ర” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు నటించగా ఈ ఇండియాస్ బెస్ట్ విజువల్ వండర్ ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. అలాగే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ కూడా అందుకొని ఈ ఏడాదికి అయితే హిందీ నుంచి భారీ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.

ఇక ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటిటి యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో ఈ నవంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కి ప్రీమియర్ గా రావడానికి రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా అయితే మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని మొదటి పది నిమిషాలు ఫ్రీ గా అయితే యూజర్స్ చూడొచ్చని అనౌన్స్ చేసారు. అంటే హాట్ స్టార్ సబ్ స్క్రైబర్ కానీ వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని మొదటి 10 నిమిషాలు చూసి ఎంజాయ్ చెయ్యొచ్చని చెప్పాలి.

Exit mobile version