ఇంట్రెస్టింగ్..తన రీమేక్ సినిమాలో తానే క్యామియోగా సూర్య..!

Published on Jun 15, 2022 3:00 pm IST


తెలుగు సినిమా దగ్గర మంచి క్రేజ్ మరియు మార్కెట్ ఉన్న తమిళ స్టార్ హీరోలలో సూర్య కూడా ఒకరు. అయితే సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం “విక్రమ్” లో చిన్న పాత్రే చేసినా దానికి మాత్రం దద్దరిల్లే రెస్పాన్స్ వచ్చింది. దీనికి ముందు తన ప్లాప్ సినిమా “ఈటి” ఎఫెక్ట్ అసలు నిలబడలేకపోయింది.

తన చిన్న క్యామియోకి తెలుగు సహా తమిళ ఆడియెన్స్ ఓ రేంజ్ లో రెస్పాన్స్ ని అందించారు. అయితే సూర్య హీరోగా నటించిన లాస్ట్ సినిమాలు రెండు ఓటిటి లో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యాయి. వాటిలో “ఆకాశం నీ హద్దురా” కూడా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే ఈ చిత్రాన్ని కూడా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమాలోనే సూర్య ఒక క్యామియో రోల్ లో కనిపిస్తాడని ఇప్పుడు తెలుస్తుంది. తన రీమేక్ సినిమాలో మళ్ళీ తాను గెస్ట్ గా కనిపించడం అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి చూడాలి సూర్య ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనేది.

సంబంధిత సమాచారం :