పవన్ “తేరి” రీమేక్ పై ఇంట్రెస్టింగ్ టాక్.!

పవన్ “తేరి” రీమేక్ పై ఇంట్రెస్టింగ్ టాక్.!

Published on Dec 10, 2022 4:03 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీసెంట్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో ఓ మాసివ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా ఓ ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని అయితే అనౌన్స్ చేస్తారని టాక్ ఉంది. కాకపోతే ఇది భవదీయుడు భగత్ సింగ్ సినిమా కాకుండా మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం తమిళ హిట్ సినిమా అలాగే తెలుగులో కూడా రిలీజ్ అయ్యినటువంటి “తేరి” చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టుగా టాక్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఒకవేళ అదే సినిమా కానీ అయితే పవన్ ఫ్యాన్స్ నుచి రియాక్షన్ కాస్త నెగిటివ్ గానే ఉంది కానీ సినిమాకి మాత్రం హరీష్ శంకర్ చాలా మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమా బేసిక్ లైన్ ని మాత్రమే తాను తీసుకున్నాడని మిగతా అంతా మార్చేసినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ సినిమా రిలీజ్ నాటికి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు