రజిని “జైలర్” స్టోరీపై ఇంట్రెస్టింగ్ టాక్..!

Published on Jun 18, 2022 2:00 pm IST


తమిళ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం తమిళ నాట స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో తన కెరీర్ లో 169వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుంచి నిన్ననే పవర్ ఫుల్ మాస్ టైటిల్ అయినటువంటి “జైలర్” ని మేకర్స్ రివీల్ చేశారు.

అయితే ఈ చిత్రం కూడా మంచి యాక్షన్ డ్రామాలా ఉంటుంది అని ఈ టైటిల్ పోస్టర్ చూస్తేనే అర్ధం అయ్యింది. మరి ఇప్పుడు ఈ సినిమా స్టోరీ లైన్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది. దీని ప్రకారం అయితే ఈ సినిమా అంతా కూడా ఒక జైల్ సెటప్ లోనే జరుగుతుందట. నెల్సన్ లాస్ట్ చిత్రం “బీస్ట్” లో షాపింగ్ మాల్ కాన్సెప్ట్ ఎలాగో ఈ సినిమాలో రజినీ జైలర్ గా గాని లేదా ఖైదీలా గాని కనిపిస్తారట.

ఆ జైలు లోనే దాదాపు సినిమా అంతా ఉంటుందని టాక్. అలాగే యాక్షన్ మరియు వైలెన్స్ లు కూడా ఈ చిత్రంలో గట్టిగానే ఉంటాయని రజినీ నుంచి అయితే సాలిడ్ యాక్షన్ ని ఈ సినిమా నుంచి ఆశించవచ్చని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ కాన్సెప్ట్ లైన్ ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :