“RRR” మేకింగ్ వీడియోపై ఆసక్తికర టాక్.!

“RRR” మేకింగ్ వీడియోపై ఆసక్తికర టాక్.!

Published on Jul 14, 2021 10:01 AM IST

భారత దేశ వ్యాప్తంగా కూడా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న పలు పాన్ ఇండియన్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ర్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” ఒకటి. తారా స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం ఇస్తూ వస్తున్నారు.

అలా ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ మేకింగ్ వీడియో కట్ ను రిలీజ్ చేయనున్నామని ప్రకటించడంతో దానిపై మరింత హైప్ నమోదు అయ్యింది. అయితే ఆ వీడియోపైనే మరో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. దీనిని రాజమౌళి మరో లెవెల్లో గూస్ బంప్స్ ఇచ్చే విధంగా చూపించనున్నారట.

ఇంతకు ముందు వచ్చిన టీజర్స్ పోస్టర్స్ కి ఎలాంటి ఎగ్జైట్మెంట్ ను కలిగించారో రేపు దీనితో కూడా అలాంటి హైప్ ను క్రియేట్ చేయనున్నారని తెలుస్తుంది. దీనిని బట్టే రానున్న ట్రైలర్, టీజర్స్ ఎలా ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ వీడియో కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు