టాక్..రానా డైరెక్టర్ తో పవన్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.?

Published on Mar 31, 2022 10:08 pm IST

రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. మళయాళ హిట్ సినిమా అయ్యప్పణం కోషియం కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

అలాగే ఇద్దరు హీరోలు కూడా ఈ సినిమాలో సాలిడ్ పెర్ఫామెన్స్ లని కనబరిచి అభిమానులకి అయితే మంచి ఫీస్ట్ ని ఇచ్చారు. మరి ఇదిలా ఉండగా ఇదే సినిమాలో నటించిన రానా హీరోగా చేసిన ఓ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నటువంటిది “విరాట పర్వం” కోసం అందరికీ తెలిసిందే.

ఈ సినిమాని తెరకెక్కించిన దసరాకుడ్ వేణు ఉడుగుల తో పవన్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చెయ్యబోతున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్ బయటకి వచ్చింది. అలాగే దీనిని కూడా హారికా హాసిని వారే నిర్మాణం వహించే అవకాశం ఉన్నట్టుగా వినికిడి. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :