చరణ్ – లోకేష్ ల ప్రాజెక్ట్ ఈ రకంగా సెట్ అయ్యే ఛాన్స్ ఉందా?

Published on Jun 8, 2022 3:00 am IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియాస్ మరో బిగ్ డైరెక్టర్ శంకర్ తో తన కెరీర్ లో 15వ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని మేకర్స్ శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా అనంతరం చరణ్ నుంచి కూడా వెరీ ఇంట్రెస్టింగ్ లైనప్ సిద్ధంగా ఉంది. అయితే ఈ లైనప్ లో లేటెస్ట్ కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనగ్ రాజ్ కూడా ఉన్నాడని తెలిసిందే.

మరి ఇది ఎప్పుడు మొదలవుతుందో కానీ ఇప్పుడు అయితే ఈ క్రేజీ కాంబో ఎలా ఉంటుందో అనే దానిపై కొన్ని థియరీలు మాత్రం మంచి హాట్ టాపిక్ గా మారాయి. లేటెస్ట్ గా లోకేష్ చేసిన “విక్రమ్” లో లోక నాయకుడు కమల్ హాసన్ కాపాడుకునే తన మనవడి పాత్ర చరణ్ చేస్తాడని బహుశా అలాగే ఉండే ఛాన్స్ ఉందని క్రేజీ టాక్ వినిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు పాజిబుల్ అవుతుందో చూడాలి. లేదా చరణ్ తో కంప్లీట్ గా కొత్త సినిమా చేస్తాడో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :