ఇంట్రెస్టింగ్..ఈ పాట “సర్కారు వారి పాట” లోనిదే..!

Published on Jan 21, 2022 1:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. మరి ఈ సినిమా టైటిల్ లో పాట అనేది ఉంది కానీ ఇంకా సినిమా నుంచి అయితే మొదటి పాట ఇంకా బయటకి రాకపోవడంతో మహేష్ అభిమానులు ముఖ్యంగా థమన్, మహేష్ కాంబో మ్యాజికల్ ఆల్బమ్ కోసం ఎదురు చూస్తున్న వారిలో ఇంకా ఆసక్తి నెలకొంది.

ఇక ఇదిలా ఉండగా తాజాగా థమన్ ట్వీట్ కూడా ఆసక్తిగా మారగా మరి ఇది సర్కారు వారి పాట సినిమా పాట కి చెందినదే అని సినీ వర్గాల్లో టాక్. అయితే మేకర్స్ వచ్చే ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలో మహేష్ మరియు కీర్తి సురేష్ ల మధ్య ప్లాన్ చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ని రిలీజ్ చేయనున్నారట. అందుకే థమన్ ముందుగా ఇలా టీజ్ చేసాడని తెలుస్తుంది. మరి మేకర్స్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసి మాస్ లోకి తీసుకెళ్లి సినిమా రిలీజ్ నాటికి సినిమాపై అంచనాలు పీక్స్ లో తీసుకెళ్తారేమో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :