రజినీ నెక్స్ట్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ అయ్యిందా.?

Published on Jun 14, 2022 7:02 am IST


కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ కం బ్యాక్ కోసం రజిని అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే తాను తీసిన రీసెంట్ చిత్రం అన్నాత్తే తమిళ్ లో హిట్ అయ్యింది తప్ప తెలుగులో ప్లాప్ అయ్యింది. ఇక దీనితో నెక్స్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయనున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు అనౌన్స్మెంట్ వచ్చిన అప్పుడు నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం పై అయితే రీసెంట్ గానే భారీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.

వీటితో పాటుగా పలు ఇంట్రెస్టింగ్ గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి కానీ లేటెస్ట్ గా ఈ సినిమా టైటిల్ పై టాక్ వైరల్ గా మారింది. దీని ప్రకారం అయితే ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్, స్పెషల్ టైటిల్ పెట్టారట. ఆ టైటిల్ ఏమిటంటే రజిని స్టార్డం కి తగ్గట్టుగా “బాస్” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు ఫిక్స్ అయ్యింది అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :