లేటెస్ట్.. షారుఖ్ – అట్లీ భారీ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్..!?

Published on Jun 2, 2022 10:55 am IST


బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోలలో ఒకరైన బాద్షా షారుఖ్ ఖాన్ సాలిడ్ కం బ్యాక్ కోసం ఇండియన్ వైడ్ తనకున్న ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఇప్పుడు తన కం బ్యాక్ కి హైప్ ఇస్తూ ఇప్పుడు వరుసగా పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లు లైన్ లో ఉండగా వాటిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న సినిమా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తో ప్లాన్ చేసిన సినిమా కూడా ఉంది.

అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఎనలేని అంచనాలు నెలకొల్పుకోగా ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై సినీ వర్గాలు నుండి ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో అయితే ఈ సినిమా కి లయన్ అనే పవర్ ఫుల్ టైటిల్ వినిపించగా ఇప్పుడు మరో టైటిల్ బయటకు వచ్చింది. మేకర్స్ అయితే “జవాన్” అనే మరో సాలిడ్ టైటిల్ ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆల్ మోస్ట్ ఈ టైటిలే ఫిక్స్ అన్నట్టు కూడా బలమైన టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :