మహేష్ – త్రివిక్రమ్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్!

Published on May 23, 2022 9:24 pm IST


టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్ ప్రకారం ఈ చిత్రానికి అర్జునుడు అనే పేరు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మహేష్ గతంలో అర్జున్ అనే సినిమా చేసాడు మరి అర్జునుడు ఫిక్స్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి, మహేష్ తన కుటుంబంతో హాలిడే ట్రిప్ యూరప్‌లో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జులై నెలాఖరులో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :