మంచు విష్ణు సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ !

20th, March 2017 - 01:49:02 PM


మంచు విష్ణు చేయనున్న తరువాతి రెండు సినిమాలు భిన్నంగా ఉండి అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. వాటిలో మొదటిది జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో చేయనున్న ‘ఆచారి అమెరికా యాత్ర’. బ్రహ్మానందం ఒక కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రం నిన్ననే ప్రారంభోత్సవం జరుపుకుంది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇక మరొక సినిమా, కొన్ని రోజుల క్రితమే ప్రకటించబడిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం కూడా టైటిల్ ను ఫిక్స్ చేసుకుని అందరి అటెంక్షన్ అందుకుంది.

నిన్న మోహన్ బాబు పుట్టినరోజు సందర్బంగా విష్ణు ఈ చిత్రానికి ‘ఓటర్’ అనే టైటిల్ ను నిర్ణయించినట్టు ప్రకటించారు. ఈ టైటిల్ చూస్తుంటే ఈ సినిమా ఏదో ఫోలిటికల్ డ్రామాగా ఉండనుందని ఇట్టే అర్థమవుతోంది. తన తండ్రి చేసిన ‘పొలిటికల్ రౌడీ’ లాంటి చిత్రాన్ని చేయాలనుందని పలు సందర్భాల్లో విష్ణు చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటే ఈ సినిమా ఆ తరహాలోనే ఉండబోతోందా అనే ఆలోచన వస్తోంది. సురభి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రాన్ని జిఎస్ కార్తీక్ డైరెక్ట్ చేయనుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు