చై – పరశురామ్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్?

చై – పరశురామ్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్?

Published on May 25, 2022 3:02 AM IST

దర్శకుడు పరశురామ్ మహేష్ బాబు హీరోగా నటించిన తన తాజా చిత్రం సర్కారు వారి పాట విజయం పై ధీమాగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అక్కినేని నాగ చైతన్య తో ఓ సినిమా లాక్ చేశాడు. ఇప్పుడు ఈ చిత్రానికి నాగేశ్వరరావు అనే పేరు పెట్టాలని పరశురామ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ విషయం పై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, ఈ వార్త ఫిల్మ్ నగర్ లో వైరల్ గా మారుతోంది. చాలా కాలం క్రితమే చైతూ తో సినిమా చేయాలని డైరెక్టర్ పరశురామ్ అనుకున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ సినిమా జరుగుతోంది. ఈ యాక్షన్ డ్రామాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు