నాగ చైతన్య కొత్త సినిమా టైటిల్ అదిరిపోయింది !


‘ప్రేమమ్’ చిత్ర విజయంతో నాగ చైతన్య కెరీర్ ఎంతలా ఊపందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో చైతన్యకు సక్సెస్ తో పాటు ప్రత్యేకమైన ఇమేజ్ కూడా దక్కింది. అందుకే చైతన్య ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటితో మరో సినిమాను చేయనున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకు ‘సవ్యసాచి’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

మహాభారతంలో అర్జునుడికి ‘సవ్యసాచి’ అనే బిరుదుండేది. మరి ఈ పేరును ఎంచుకున్నారంటే సినిమాలో కొత్త తరహా కాన్సెప్ట్ ఏదో ఉంటుందనే అనిపిస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. దీనికి సంబందించిన టైటిల్ లోగోను ఇంకొద్దిసేపట్లో రిలీజ్ చేయనున్నారు.