ప్రభాస్ తరువాతి సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ !


రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యే యంగ్ డైరెక్టర్, ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ సింగ్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న కొత్త చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకునేందుకు సుజిత్ గట్టి గ్రౌండ్ వర్క్ చేసి మరీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క టైటిల్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో హల్ చల్ చెస్తోంది.

అదేమిటంటే ఈ సినిమాకి ‘సాహో’ అనే టైటిల్ ను నిర్ణయించారట. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పేరు మీద ఫిల్మ్ చాంబర్లో ఈ టైటిల్ రిజిష్టరైంది కూడా. ‘బాహుబలి-2’ టైటిల్ సాంగ్ లో ఎక్కువగా వినిపించే ఈ సాహో పదం దాదాపు అన్ని పరిశ్రమల ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. సాహో అనే పదం వినిపిస్తే చాలు జనాలు పాటందుకుంటున్నారు. అంతటి క్రేజ్ ఉంది కనుక ఆ పదాన్నే సినిమా టైటిల్ గా ఫిక్స్ చేశారట. తెలుగు, తమిళం, హిందీ భాషలలో రూపొందనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతం అందించనుండగా ‘శ్రీమంతుడు, ఘాజి’ ఫేమ్ మది సినిమాటోగ్రఫీ అందించనున్నారు.